ఈ ఎనిమిది అద్భుత
ఆవిష్కరణలు మహిళలు అందించినవే..
1. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ - గ్రేస్ హాపర్
ప్రముఖ
ఆవిష్కర్తల పేర్లు చెప్పమని అడిగితే.. చాలామంది థామస్ ఎడిసన్.. మార్కోనీ..
గ్రాహం బెల్‌ల పేర్లతో ప్రారంభిస్తారు. మరి మేరీ ఆండర్సన్.. అన్ త్సుకమోటోల సంగతేంటి?
మీకు
వాళ్ల పేర్లు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ఆ
ఇద్దరు మహిళా ఆవిష్కర్తలే.. మనం రోజూ వాడే ప్రతి వస్తువు,
సాంకేతికత వెనక ఉన్నారు.
‘‘బీబీసీ
100 విమెన్ ఛాలెంజ్’’లో
భాగంగా ప్రపంచ నలుమూల నుంచి గొప్ప మహిళల గురించి బీబీసీ కథనాలు అందిస్తోంది.
ఈ
సందర్భంగా మహిళలు ప్రపంచానికి అందించిన 8
అద్భుత ఆవిష్కరణల గురించి తెలుసుకుందాం.
1. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ -
గ్రేస్ హాపర్
రెండో
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా నేవీలో చేరిన గ్రేస్ హాపర్.. అక్కడే కొత్త
కంప్యూర్ మార్క్1ను తీర్చిదిద్దడంలో కీలక
పాత్ర పోషించారు. అ
ప్పుడే
ప్రోగ్రామింగ్ కోడ్‌ను కంప్యూటర్ భాషలోకి అనువాదం చేసే కంపైలర్ సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను
అభివృద్ధి చేశారు.
సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లలో డి-బగ్గింగ్ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది కూడా గ్రేస్ హాపరే. 79 ఏళ్ల వయసు వచ్చే వరకూ ఆమె కంప్యూటర్ అభివృద్ధి కోసం పనిచేశారు. అందుకే అంతా ఆమెను 'అమేజింగ్ గ్రేస్' అని పిలుస్తుంటారు.
2. కాలర్ ఐడీ, కాల్ వెయిటింగ్- డా.షెర్లీ ఆన్
జాక్సన్
ఫోన్
కాల్ ఎవరి నుంచి వస్తుందో తెలిపే కాలర్ ఐడి, మనం
ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మరో కాల్ వస్తే తెలిపే కాల్ వెయిటింగ్ ఫీచర్లను ఈమె
అభివృద్ధి చేశారు.
భౌతిక
శాస్త్రంలో శాస్త్రవేత్త అయిన డా. షెర్లీ.. టెలికాం రంగంలో అనేక పరిశోధనలు
చేశారు.
ఫైబర్
ఆప్టిక్ కేబుల్, ఫ్యాక్స్ మెషీన్లు,
సోలార్ బ్యాటరీల తయారీ వెనక ఈమె పరిశోధనలే కీలకం.
అమెరికాలోని
ప్రఖ్యాత మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డాక్టరేట్ అందుకున్న
తొలి ఆఫ్రికన్-అమెరికన్.
3. వాహనాల గ్లాస్ వైపర్-
మేరీ ఆండర్సన్
1903లో
మేరీ ఆండర్సన్ న్యూయార్క్‌లో పర్యటిస్తున్నారు. చలికాలం కావడంలో తన కారు అద్దాలపై
మంచు పడుతోంది.
ఆ
మంచును తొలగించేందుకు డ్రైవర్ మాటిమాటికీ కారును ఆపి, బయటకు
వెళ్తున్నాడు. దాంతో కారులో ఉన్న వారూ చలికి వణికిపోతున్నారు.
ఆ
సమస్యకు పరిష్కారం గురించి ఆలోచించిన మేరీ ఆండర్సన్.. రబ్బరుతో గ్లాస్ వైపర్‌ను
తయారు చేశారు.
దానిపై
1903లోనే ఆమె పేటెంట్ హక్కులూ పొందారు.
4. అంతరిక్ష కేంద్రం
బ్యాటరీలు- ఓల్గా డి గాన్జలెజ్ సనాబ్రియా
అత్యధిక
బ్యాకప్ ఇచ్చే నికెల్-హైడ్రోజన్ బ్యాటరీల సాంకేతికతను 1980లోనే
ఓల్గా అభివృద్ధి చేశారు.
ఈ
బ్యాటరీలను అంతరిక్ష కేంద్రాల్లో వినియోగిస్తారు.
ప్రస్తుతం
నాసా పరిశోధనా కేంద్రంలో ఇంజినీరింగ్ విభాగం డైరెక్టర్‌గా ఓల్గా పనిచేస్తున్నారు.
5. డిష్ వాషర్- జోసెఫీన్
కోష్రేన్
తన
ఇంట్లో పని మనిషి కంటే వేగంగా.. భద్రంగా.. శుభ్రంగా వంట పాత్రలను కడిగేసే డిష్
వాషింగ్ మెషీన్‌ను తయారు చేశారు. ప్రపంచంలో తొలి ఆటోమేటిక్ డిష్ వాషర్ అదే.
ఈ
ఆవిష్కరణకు గాను 1886లోనే ఆమె పేటెంట్ హక్కులు
పొందారు.
డిష్
వాషర్ తయారీ పరిశ్రమను ప్రారంభించారు.
6. హోం సెక్యూరిటీ సిస్టం-
మేరీ వ్యాన్ బ్రిట్టన్ బ్రౌన్
నర్సుగా
పనిచేసే మేరీ.. ఎక్కువగా ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చేది.
రోజురోజుకీ
నేరాలు పెరిగిపోతుండటంతో ఇంటి గుమ్మాన్ని పర్యవేక్షించేందుకు 1960లో
ప్రత్యేక కెమెరాను ఏర్పాటు చేశారు.
ఇంటి
లోపలే ఉండే ఆ కెమెరా ఇంటి ముందు పరిసరాలను తలుపు రంధ్రంలోంచి చిత్రీకరిస్తూ
ఉండేది.
ఆ
వీడియోను బెడ్ రూంలోని తెరపై చూసే వీలుండేది. ఆ ఆలోచనే ప్రస్తుత సీసీ కెమెరా
సెక్యూరిటీ వ్యవస్థలకు పునాదిగా చెప్పొచ్చు.
7. మూల కణాలను వేరు చేయడం- ఆన్
త్సుకమోటో
రక్తకణాలు
ఉత్పత్తిలో కీలకమైన స్టెమ్ సెల్స్‌ను వేరు చేసే విధానాన్ని కనుగొన్నారు. అందుకు 1991లో
పేటెంట్ పొందారు.
ఈ
విధానంతో బ్లడ్ క్యాన్సర్ వైద్యం సులభతరమైంది. ప్రస్తుతం స్టెమ్ సెల్ ఎదుగుదలపై
ఆమె పరిశోధనలు చేస్తున్నారు.
8. కెవ్లార్(బుల్లెట్ ప్రూఫ్
ఫైబర్)- స్టెఫనీ కోలెక్
బుల్లెట్
ప్రూఫ్ దుస్తులు తయారీలో వినియోగించే ఫైబర్‌ను 1965లో
సృష్టించారు. స్టీల్ కంటే ఐదు రెట్లు గట్టిగా ఉండే ఆ పదార్థంతో రూపొందించిన
జాకెట్లను లక్షల మంది సైనికులు.. పోలీసులు వినియోగిస్తున్నారు.
చేతి
గ్లౌజులు.. మొబైల్ ఫోన్లు.. విమానాలు.. వేలాడే వంతెనల తయారీలోనూ ఆ ఫైబర్‌ను
వాడుతున్నారు.
No comments:
Post a Comment
All are gods Children - Anonymos