దుష్టుల త్రోవలో నడవక ఉండేందుకు ప్రార్ధన
దయగల దేవా, నన్ను మంచి మార్గములో నడిపించుము తండ్రి. దుష్టుల ఆలోచనచొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఉండేటువంటి భాగ్యాన్ని నాకు దయచేయండి. దుష్టులు వలె నుండక నేను మీ యొక్క వాక్యానుసారం జీవించేటట్లు చేయండి ప్రభూ. దుష్టులు
గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు, నీతిమంతుల యొక్క
మార్గము మీకు తెలియును,
దుష్టుల మార్గము నాశనమునకు దారితియును అని మీరు
మీ వాక్యము ద్వారా సెలవిచ్చియున్నారు ప్రభువా.
ప్రభువా నేను మీ యొక్క
ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, రాత్రింబగళ్ళు మీ యొక్క వాక్యాని
ధ్యానించుభాగ్యాన్ని నాకు దయచేయండి. దయగల తండ్రి మీరు ఈ విధముగా సెలవిచ్చియున్నారు తండ్రి, మీ వాక్యము చదివిన ప్రతి బిడ్డ
తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును అన్ని సెలవిచ్చియున్నారు. నేను కూడా మీ యొక్క వాక్యాన్ని క్రమం తప్పకుండా పఠించి, వాటిని అనుసరించు వరాన్ని నాకు అనుగ్రహించండి. నా ఈ మనవిని మా నాధుడైన యేసు క్రిస్తు ద్వారా మీ ముందుంచుచున్నాను తండ్రి. ఆమెన్.
No comments:
Post a Comment
All are gods Children - Anonymos