చెవులు కుట్టించు సమయంలోని ప్రార్ధన
మహిమాన్వితుడైన యేసు ప్రభువా చెవుల్లో నీళ్లు పెట్టి ఉమ్మి నీటితో నాలుకను తాకి మూగ చెవిటి వారికి స్వస్థత కూర్చాడు పంచేంద్రియాల లో ఒకటైన అనేది గొప్ప వరం అందుకే నీ భక్తుడు సేవకు డైన పౌలు మహర్షి వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును అని బోధించాడు సాంప్రదాయంగా చెవులు కుట్టించడం సదాచారము ఆధ్యాత్మికం కొంత అర్థాన్ని పరమార్ధాన్ని సంతరించుకుంది ఈ బిడ్డలు నీ అనుగ్రహం తో నింపి కేవలం శారీరక సౌందర్యమే కాకుండా దేవుని వాక్యం వినడంలో కూడా వహించినట్లు దీవించమని నీ పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్