నూతన దంపతులకు ఆశీస్సులు అందించే సమయంలోని ప్రార్ధన
అనురాగ నిలయమైన దేవా, వివాహ సంస్కారాన్ని అన్నిటిలోనూ ఘనంగా ఉన్నతంగా కలుగజేశారు. వివాహ దుస్తులతో ప్రవేశించిన ఈ నూతన దంపతులను దీవించండి. వీరి వైవాహిక జీవితం శాంతియుతంగాను సమాధానంగాను సాగునట్లు పరిశుద్ధాత్మ పూరితులై ఆదర్శ దంపతులుగా వర్ధిల్లునట్లును చెయ్యండి. వీరి కోరికలను తీర్చి తమకు కలుగబోవు సంతానమును భక్తి ప్రపత్తులతో ఆదర్శ క్రైస్తవ బిడ్డలుగా తీర్చి దిద్దుటకు కావలసిన శక్తిని ప్రసాదించమని మా నాధుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము ఆమెన్
No comments:
Post a Comment
All are gods Children - Anonymos