నిశ్చితార్థం సమయంలోని ప్రార్ధన
ప్రేమ స్వరూపుడు అయిన దేవా వివాహ నిశ్చితార్థం మున కై ఇక్కడ చేరిన ఈ బిడ్డను ఆశీర్వదించండి నీ పవిత్ర ఆత్మ జ్ఞానం వీరి హృదయాలలో భద్రపరచండి వివాహ సంస్కారము నకై తమ్ము తాము సిద్ధ పరుచుకుని పరిపూర్ణంగా సమర్పించుకోన భక్తిని మీ శక్తిని అనురక్తిని అనుగ్రహించండి నీ కృప సంపదలో దిన దిన ప్రవర్ధమానం అవుతూ పరస్పర గౌరవ ప్రేమలలో పెంపొందుతూ పవిత్ర వివాహ బంధములో ప్రవేశించ దీవించండి వీరి ఆదర్శ జీవితం అందరికీ ఆదర్శంగా ఉండునట్లు మా నాథుడు నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము