ABOUT ME

My photo
Khammam District Ph: 6360572067, Telangana, India
The Jacob Gapp School is run by the Marianist (Society of Mary) Brothers in Khammam District, Telangana State, India. The School solely exists with the generosity of the Marianist Brothers from the Austrian Province. The school aims to provide education to all the children with different social background in the vicinity.

JESUS SAVES

css3menu.com

కష్ట సమయాలలో ప్రార్ధన


కష్ట సమయాలలో ప్రార్ధన

కష్ట సమయాలలో ఆదుకొనే తండ్రి, కష్టాలను అధిగమించడానికి, ఓర్పు సహనమును కలిగి యుండుటకు కావలసిన శక్తిని యుక్తిని నాకు అనుగ్రహించండి. ప్రభువా మేము పదే పదే మాకు కలిగిన  బాధల గురించి, మాకు  వచ్చినటువంటి కష్టాలను గురించి పదే పదే వాటి గురించి ఆలోచించుతూ బాధపడకుండా ఉండేటువంటి గట్టి హృదయాన్ని, గుండె దైర్యాన్ని మాకు కలుగజేయండి.

 

దయగల దేవా, మొదట మాలో ఉన్నటువంటి బయాందోళ్ళలను అధిగమించే  వ్యక్తిలా, మరియు కష్ట సమయాలలో, ఈ కష్టమైనా పరిస్తితుల నుంచి  మీ కృప ద్వారా ఎలా అధిగమించాలో ఆలోచింప చేసేటువంటి ఆలోచనా శక్తిని కలిగి యుండే బాగ్యాన్ని మాకు అనుగ్రహించండి.

 

  మనిషి తన హృదయంలో ఆలోచించినట్లే అతడు కూడా ఉన్నాడుఅని బైబిల్ చెబుతుంది. సరైన ఫలితాన్ని పొందడానికి సరైన మనస్తత్వం అవసరం. ఆ యొక్క మంచి మనస్తత్వంను మాకు ప్రసాదించండి. పునీత మార్కు గారు సువిషేషములో  అధ్యాయము 9 వచనము 23 లో, సెలవిచ్చునట్లు, “విశ్వాసంతో మేము అసాధ్యమైన కార్యములను సాద్యము  చేయగలమని చెపుతూ ఉన్నారు, కాబట్టి మేము మీపై గట్టి విశ్వాసం కలిగి ఉండే విధముగా, అదే విశ్వాసముతో మా యొక్క  జీవిత సవాళ్లను ఎప్పుడూ  అధిగమించేలాగున మాకు మీ యందు విశ్వాసాన్ని, దైర్యాన్ని కలుగజేయండి.

 

మేము  సరైన మనస్తత్వాన్ని, దృడ విశ్వాసాన్ని  మీ  వాక్యం ద్వారా, పెంపొందించుకొనే బాగ్యాన్ని మాకు దయచేయండి. దేవుని వాక్యం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది, మరియు దేవునిపై మన విశ్వాసం మనకు సరైన మనస్తత్వాన్ని లేదా మన కష్టాలనుంచి, ఓర్పు దైర్యంతో అధిగమించడానికి కావలసిన దైర్యాన్ని  ఇస్తుంది. పునీత యోహాను గారు తమ యొక్క సువిశేషము ద్వారా సెలవిచ్చినట్లు “విశ్వాసం లేకుండా ఏ విశ్వాసి జీవితంలో విజయం సాధించలేడు 1 యోహాను 5: 4.

 

ఈ యొక్క కాలములో, సాంకేతిక టెక్నాలజీ అభివృద్ధి చెందిన యుగంలో,  చాలా మంది విశ్వాసులు, దేవునిపై ఉన్న విశ్వాసముతో జీవితంలో ఎన్నో ఒడి దొడుకులను, కష్టాలను, బాధలను అధిగమించారు, ఎందుకంటే వారి విశ్వాసం వారిని కష్టతరమైన, ఇబ్బందికరమైన పరిస్తితుల నుంచి దేవుని యందు వారి యొక్క నమ్మకాన్ని  బలపరచింది.  తప్పు మనస్తత్వం ఉన్నవారు, దేవుని యెడల భయబక్తులు లేని  వారు,  యేసుక్రీస్తు  ఎవరో తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ లోకంలోని శైతాను శక్తులకు లోబడి, వారి ఇష్టానుసారముగా ప్రవర్తించే వారు వారి వారి  జీవితంలో తప్పుడు ఫలితాలను అనుబవిస్తూనే ఉంటారు.
 
మనము  జీవితంలో కష్టాలను, బాధలను, ఓర్పు సహనముతో  అధిగమించే విధముగా చూడటం ప్రారంభించే వరకు, మనము మన యొక్క జీవితములో వచ్చే  సవాళ్లను ఎప్పటికీ అధిగమించలేము.
 
మన  జీవితంలో విజయాన్ని చూడటం, విజయాన్ని కొనసాగించడానికి, మనకు  దేవుని అశిస్సులు ఎంతో అవసరము. మనము పూర్ణ మనస్సుతో నిరంతరం మన మనస్సును, ఆలోచనా శక్తిని దేవుని యందు  పునరుద్ధరించాలి. ఉదాహరణకు, మనము నిత్యమూ దేవునికి చేసే ప్రార్థనలు ద్వారా మనము మన జీవితములో వచ్చే  సవాళ్ళ నుండి బయటపడటానికి గల మార్గం ప్రార్ధనామార్గం, కానీ దేవునిపై నమ్మకము లేక, లేదంటే మన మీద మనకు నమ్మకము లేక, ఆత్మ విశ్వాసము లేక తప్పు మనస్తత్వంతో ప్రార్థించడం వల్ల ఎటువంటి సానుకూల ఫలితాలు రావు.
 
 
మనము దేవుని బిడ్డల  వలె జీవించాలి. దేవునిపై భయబక్తులు కలిగి ఉండాలంటే చిన్న బిడ్డల  మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి. మన పవిత్ర గ్రందమైన బైబిల్ మనం దేవుని సంతానం అని చెబుతుంది, ఒక మేక ఎల్లప్పుడూ మరొక మేకకు జన్మనిస్తుంది, మరియు దేవుడు తనలాగే మన అందరికి  తన యొక్క రూపంలో బాగస్వామిని చేసాడు. మనము దేవుని నుండి భాగస్తులమైనాము. కనుక మనము కుడా దేవుని స్వభావమును కలిగి ఉండేటట్లు ప్రయత్నం చేయాలి. మనము దేవుని నుండి జన్మించినట్లయితే మనము ఇతరులకు వారికి చేసే సహాయములో, మంచి కార్యములలో దేవుని యొక్క స్వబావాన్ని చూపించాలి. 
 
కొందరు నిస్సహాయ స్తితిలో ఉన్నవారు సహాయము చేసిన వారిని దేవుడిగా పరిగణిస్తారు.  మనము కుడా  ఈ లోకంలో ఒక దేవుడిలా ఇతరులకు మన కార్యముల ద్వారా తెలియచెప్పాలి.  అందువల్ల దేవుడు ఆపలేనిది ఎటువంటి శక్తి ఐన మనలను  ఆపదు ఆపలేదు. భగవంతుడిని అధిగమించలేనిది ఎటువంటి శక్తి ఐన మనలను  మనలను అధిగమించదు అధిగమించలేదు. మనము  ఈ దేవుని సంక్లిష్ట మనస్తత్వంతో ప్రార్థించినప్పుడు, మీరు సానుకూల ఫలితాలను చూడగలరు. ఇప్పుడు నమ్మిన వ్యక్తిగా సవాళ్లను ఎలా అధిగమించాలో చూద్దాం.