మంచి ఆలోచనల కొరకు ప్రార్ధన
తండ్రి మీ వాక్యము యథార్థమైనది,
మీరు మా కొరకు
చేయునదంతయు మేము మరువకుండునట్లు, మీ కార్యములను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని వాటికనుగుణంగా నడచుకొనుటకు కావలసిన వరాలను మాకు ప్రసాదించండి. మీరు నేర్పినటువంటి నీతిని,
న్యాయమును తుచ తప్పకుండ అనుసరించు శక్తి సామర్ధ్యాలను ప్రసాదించండి. ఈ
లోకము అంతా మీ కృపతో నిండియున్నది అనే సత్యాన్ని ఎల్లవేళలా గుర్తుంచుకొనేటట్లు, నీ
వాక్కు చేత ఆకాశములు కలిగెను, మీ
నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను అనే సత్యమును మేము ఎల్లవేళలా స్మరించుకునే భాగ్యమును మాకు ప్రసాదించండి. . సముద్రజలములను, అగాధ జలములను సృష్టించిన సృష్టికర్తయైన దేవా, మీ యందు భయభక్తులు కలిగి ఉండేటట్లు మా విశ్వాసాన్ని బలపరంచండి.
తండ్రి,
మీ ఆలోచన సదాకాలము నిలుచును, మీ
సంకల్పములు తరతరములకు ఉండును. అదే విధముగా మా ఆలోచనలు, మా సంకల్పములు నిత్యము
మీ యందు ఉండునట్లు, మీరు మాకు చూపించిన మార్గములో పయనించే సామర్ధ్యాన్ని మాకు అనుగ్రహించండి. మహిమగల దేవా, మీ
దృష్టి మీ యందు భయభక్తులుగలవారి మీదను మీ
కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచు చున్నది అని మేము బలముగా నమ్ముతున్నాము. ఈ మా విశ్వాసాన్ని బలపరంచండి. నా ఈ మనవిని మా నాధుడైన యేసు క్రిస్తు ద్వారా మీ ముందుంచుచున్నాను తండ్రి. ఆమెన్.
No comments:
Post a Comment
All are gods Children - Anonymos