వీటిని ఇతరులకు కూడా అందజేయండి text
తెలుగు సూక్తులు
తెలుగు సూక్తులు
ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
మనం
పుట్టినప్పుడు మనల్ని ఎవరూ వచ్చి చూశారో మనకు తెలియదు మనం మరణించాక మనల్ని ఎవరు
చూడడానికి వస్తారో కూడా మనకు తెలియదు కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్న
వాళ్లను మనసారా ప్రేమించండి ఆప్యాయతలను పంపించండి
ఒక మనిషి గురించి మరో మనిషికి
జీవితాంతం గుర్తుండిపోయే రెండే రెండు విషయాలు చేతితో చేసిన సహాయం మాటతో మనసుకు
చేసిన గాయం గౌతమ బుద్ధ
గౌరవం
అనేది గుణాన్ని చూసి ఇస్తారు ధనాన్ని చూసి కాదు ఎందుకంటే చాలా ఖరీదు పెట్టుకున్న
చెప్పులను గుడి బయట వదిలేస్తాను కొద్ది ఖరీదు పెట్టి కొన్న కొబ్బరికాయను గుడిలోకి తీసుకెళ్తాము
అబద్దానికి
అభిమానులు ఎక్కువ నిజానికి శత్రువులు ఎక్కువ
ఆస్తిపాస్తుల
కన్నా నోట్లో నాలుకని భద్రంగా ఉంచుకోవడం కష్టం, పేద వారిని హీనంగా చూడకు పరిస్థితి ఎవరికైనా
ఎప్పుడైనా మారొచ్చు, మీ మాట చెల్లని సందర్భాలలో మౌనంగా ఉండటం ఉత్తమం భక్తి లేకున్నా
చెడు పనులు చేయకుండా ఉంటే చాలు
మనలో నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత
వరకు భగవంతుడు మనకు ఎప్పుడూ అండగా ఉంటాడు
మన సంస్కారం చెబుతుంది కుటుంబం
ఎలాంటిదో, మనం మాట్లాడే మాటలు చెబుతాయి
స్వభావం ఏమిటో, మనం చూసే చూపు చెబుతుంది
ఉద్దేశం ఏమిటో, మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎంతుందో, మన విజయం చెబుతుంది నేర్పిన విద్య ఎలాంటిదో.
నమ్మకం ఉంటే మౌనం కూడా
అర్థమవుతుంది, నమ్మకం లేకుంటే అపార్థం అవుతుంది
విజయం గొప్పది కాదు సాధించిన
వ్యక్తి గొప్ప, బాధపడటం కాదు బాధను తట్టుకోవడం గొప్ప, బాంధవ్యాలు గొప్ప కాదు వాటిని నిలబెట్టు వాడు
గొప్ప.
నువ్వు బాధ పడతావు అని అబద్ధం
చెప్పే వారి కంటే నువ్వు బాధ పడిన పర్వాలేదని నిజం చెప్పే వారినే నమ్మాలి. జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది, మనకు తోడుగా నడిచేవారు ఉంటారు కానీ మనకు బదులుగా
నడిచే వారు ఉండరు, ఎంత కష్టమైనా అవసరాన్ని
బట్టి అనుబంధాలు ఏర్పడదు, అనుబంధాలు అవసరం తీర్చే వై ఉండాలి.
కొందరు ఎవరి కోసం అయితే వాళ్ళ
జీవితాన్ని త్యాగం చేసి కష్టపడతారో వాళ్ళకి వారి దగ్గర నుండి దక్కాల్సిన ప్రేమ దక్కదు
జీవితంలో
ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోతారు, ఒకరు అందరి మాటలు వింటూ ఓడిపోతారు ఎవరు మాటలు
విన్న చివరకు ఆలోచన నీదై నప్పుడే నీ జీవితానికి విజయం
జీవితంలో కొన్ని సార్లు ఒంటరిగా
నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఆ
ఒంటరితనం నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది.
అవసరం ఉన్నప్పుడే పలకరిస్తారు అని
ఎవరు గురించి బాధ పడకు, వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు
వస్తావు అని సంతోషించు.
“మన వాళ్ళు” మనల్ని ఎప్పుడూ ఏడిపించరు, :మన” అనుకుని మనం పొరబడినవాళ్ళే ఏడిపిస్తారు.
వంద కుక్కలు
ఒక్కటై ఒక్కసారిగా మొరిగిన, ఒక్క
సింహగర్జనకు సమానం కాదు. ఎంతోమంది గట్టిగా
అరచి ప్రచారం చేసినా, ఒక నింద ఎప్పుడూ
నిజం కాదు.
మాట్లాడే
ముందు కొంచెం ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి, ఎందుకంటే మనం ఆడే మాట గోడకు కొట్టిన మేకు
లాంటిది. మేకును గోడ నుండి తీసినప్పటికీ, గోడకు పడిన రంధ్రం
అలానే ఉంటుంది. అలాగే క్షమించండి అని మాట
వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా ఆ మనసుకు పడిన గాయాన్ని మాన్పలేము.
ప్రేమగా
పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా అయిన వాళ్లు అవుతారు. కఠినంగా మాట్లాడితే అయిన వాళ్లు కూడా దూరం
అవుతారు. అందుకే అందర్నీ ప్రేమగా
పలకరించటం ఉత్తమం. పోయేదేముంది మాటే కదా
ఎప్పుడైతే
మీరు ఎమోషనల్ ఫీల్ అవుతారో అప్పుడు మిమ్మల్ని ఎదుటివారు వాడుకోవడం ఆడుకోవడం
శాసించడం జరుగుతుంది.
ఒంటరిగా
ఉన్న అక్షరాలలో ఏ అర్థం ఉండదు అవే అక్షరాలు జత కడితే అర్థవంతమైన పదాలు వాక్యాలుగా
మారిపోతాయి. మంచివారితో స్నేహం వల్ల మన
జీవితం అర్థవంతంగా మారిపోతుంది .
మనకి ఎంత
ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్నే, మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్ని,
మనం ఎంత మంచి కులంలో పుట్టిన అందరూ చూసేది
మంచితనాన్ని, మనది ఎంత గొప్ప మతమైనా అందరూ
చూసేది మానవత్వాన్ని, ధనం ఉంటే ధనవంతుడు
అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు.
ఇది తెలియక చాలామంది ధనవంతులు గానే మిగిలిపోతున్నారు.
నదీ నదిలా
ప్రవహిస్తునంతకాలం దానిని పవిత్రంగానే చూస్తాము, ఎప్పుడైతే నది సముద్రంలో కలుస్తుందో అప్పుడు దాని అస్తిత్వం కోల్పోతుంది, అలాగే మీరు మీలాగే ఉన్నంతకాలం సంతోషంగా ఉంటారు,
ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుని వారిలా ఉండాలనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు.
కాలుతున్న
నిప్పుతో ఒకరికి గాయమైన చేయవచ్చు లేదా మంచికి ఉపయోగించవచ్చు, మన కోపం కూడా
అలాంటిదే కాకపోతే వాడే విధానం తెలిసిన ఆత్మీయులు తోడు ఉంటే మంచి జరుగుతుంది, వాడుకోవడం మాత్రమే తెలిసిన స్నేహాలు అయితే చెడు
జరుగుతుంది.
ఎప్పుడైనా
చిన్నపిల్లలు వర్షం ఎక్కడ నుండి వస్తుంది అని అడిగితే, దేవుడు కురిపిస్తాడు అని
కాకుండా, మనం ఒక మొక్క నాటితే ఒక చుక్క వర్షం వస్తుంది అని చెప్పండి.
ఆనందం అనేది
నీ ఆలోచనలో నుంచి వస్తుంది గెలుపులో నుంచి కాదు.
బలహీనులు
మాత్రమే ప్రతికారం కోరుతారు, బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు, బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మర్చిపోయి
ప్రశాంతంగా జీవిస్తారు.
కష్టాల్ని
ఎదిరించే దమ్ము బాధలనుభవించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు
గెలవబోతున్నావని అని అర్థం.
No comments:
Post a Comment
All are gods Children - Anonymos