ABOUT ME

My photo
Khammam District Ph: 6360572067, Telangana, India
The Jacob Gapp School is run by the Marianist (Society of Mary) Brothers in Khammam District, Telangana State, India. The School solely exists with the generosity of the Marianist Brothers from the Austrian Province. The school aims to provide education to all the children with different social background in the vicinity.

JESUS SAVES

css3menu.com

తెలుగు ప్రార్ధనలు

Untitled Document

ప్రార్ధనలు

1. జీవితములో కష్టాలు, సమస్యలు, నిరాశలు కలిగినప్పుడు

2. అన్న ప్రసన్న

3. పుట్టిన రోజు ప్రార్ధన

4. పుట్టు వెంట్రుకలు

5. చెవులు కుట్టించుట

6. అక్షరాబ్యాసము

7. రజస్వల మహోత్సవం

8. ఒణిల దోవతుల ప్రదానం

9. నిశ్చితార్దం

10. ప్రదానోత్సవం ప్రార్ధన

11. నూతన దంపతులకు ఆశీర్వాదం

12. సంతాన బాగ్యము

13. సీమంతం వేడుక

14. దుష్టుల త్రోవలో నడువక ఉండేందుకు ప్రార్ధన

15. శత్రువుల బారి నుంచి రక్షణ కొరకు ప్రార్ధన

16. వేకువ జామున ప్రార్ధన

17. దేవుని కార్యముల యందు నమ్మకము కొరకు ప్రార్ధన

18.

19.

20.

 

జీవితంలో కస్టాలు, సమస్యలు, నిరాశలు ఎదురైనప్పుడు  నమ్మకం కోసం ప్రార్ధన

ప్రేమమైయుడైన ప్రభువా, జీవితంలో   నేను మోస్తున్న భారాలు మరియు  వచ్చే నిరాశలు, నిస్పృహలు  భరించలేనట్లు అనిపిస్తుంది. ప్రభూ, నా రోజువారీ పనులు ప్రతి వారం గడిచేకొద్దీ పెరుగుతున్నట్లు అనిపిస్తుంది తండ్రి, మరియు నేను ఎంత ఎదుర్కోవాలని చూసినా నాలోని సహనాన్ని  కోల్పోతున్నాను ప్రభువా. దయగల దేవా, నా యొక్క కుటుంబము కొరకు, నా భార్యా పిల్లల కొరకు నేను ఏమి చేయలేక పోతున్నాను తండ్రి. నా కుటుంబము పట్ల నేను చేయవలసిన బాధ్యత  నేను ఎప్పుడూ చేయలేను అని నా మనసులో నేను మదన పడుతున్నాను. అనేక కష్టాలతో నా మనసు సతమతమౌతుంది ప్రభువా. ఇలాంటి కష్టాలు  రోజు రోజుకు పెరుగుతున్నాయి గాని తగ్గటలేదు ప్రభువా. ఇవన్నీ తలచుకొని అనుక్షణం నేను చింతిస్తున్నాను.

తండ్రి కొన్నిసార్లు ముందుకు వెళ్ళే మార్గం చాలా స్పష్టంగా అనిపిస్తుంది, కాని ఇతర సమయాల్లో మార్గం అనిశ్చితంగా కప్పబడి ఉన్నట్లు అనిపిస్తుంది మరియు ముందుకు వెళ్లే రహదారి ప్రశ్నార్థక నీడలలో దాగి ఉన్నట్లు అనిపిస్తుంది. నన్ను ముందుకు నడిపించండి. ఈ సమస్యలను బాధలను, నిరాశలను ఎదుర్కొనే శక్తిని నాకు ప్రసాదించండి. దయగల ప్రభువా, ఇలాంటి కష్టతరమైన పరిస్థితులలో నన్ను  సరైన మార్గంలో నడిపించండి, నేను ఎక్కడికి వెళ్ళినా నాతో ఉంటానని మీరు వాగ్దానం చేసారు ప్రభువా, ఎందుకంటే నేను తీసుకునే అడుగులు మీకు తెలుసు. నేను మీపై అపారమైన  నమ్మకమును  కలిగిఉండునట్లుగాను కేవలం  నిన్ను మహిమపరిచే కార్యములను   మాత్రమే చేయునట్లుగాను నన్ను ఆశీర్వదించండి.

 

కష్ట సమయాల్లో నాకు ఓదార్పునివ్వండి. ప్రజలు నన్ను విడిచిపెట్టినప్పుడు నాకు ధైర్యమును దయచేయండి.
నా స్నేహితులు నన్ను విడిచిపెట్టినప్పుడు, మీరు నాకు  తోడుగా ఉండండి. నేను చేసే పనులు విఫలమైనప్పుడు, నాలోని సహనము కోల్పోకుండా నాలో ఉత్సాహాన్ని నింపండి. ప్రజలు నా గురించి చెడుగా చెప్పినప్పుడు, నా యొక్క పేరును, గౌరవాన్ని తూలనాడినప్పుడు, వారిని క్షమించే మంచి  హృదయాన్ని గుణాన్ని నాకు దయచేయండి. మహిమగల దేవా, నిరాశ, నిస్పృహలతో ఉన్నవారికి మీరు ఆశాకిరణం.

BACK TO TOP

అన్న ప్రసన్నం

ఆహారమును అని పలికిన యేసు ప్రభువా చిన్న బిడ్డ పైన నీ దీవెనలు కురిపించే అండి జీవించుటకు జీవితం కొనసాగించుటకు ఆహారం అవసరం శిశువునకు మొదటి సారి అన్న ముట్టించు సందర్భంగా నీ దివ్య పాదాలు చాచి ఆశీర్వదించండి ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్షును ప్రసాదించండి ఆహార పుష్టి తో పెద్దల అండదండలతో అభివృద్ధి చెందినట్లు నీ నామ స్మరణలో సేవలను సేవలు పొందునట్లు జ్ఞానంలో సంస్కారం ఉన్నత శిఖరాలు అధిరోహించి నట్లు నీ కరుణ కిరణములను కురిపించును నీ పరిశుద్ధ నామమును వేడుకొనుచున్నాను ప్రభువా ఆమెన్

BACK TO TOP 

 

పుట్టిన రోజు ప్రార్ధన

సృష్టికర్త అయిన ప్రభువా మా జన్మ కి మూలం నీవే మా ఆశల ఆశాదీపం నీవే మా ప్రణాళికలో సాఫల్యం కూడా నీవే నీవు ఇంతవరకు చేసిన మేలులకు కృతజ్ఞతలు జన్మదిన వేడుకలు చేసుకుని కుటుంబం నీ దీవెనలు కురిపించే అండి తల్లిదండ్రులకు పెద్దలకు ప్రియంగా ఆమోదయోగ్యంగా జీవించే సద్గుణాల సంపద నివ్వండి దైవ జ్ఞానాన్ని విషయ పరిజ్ఞానం అనుగ్రహించండి సుఖ సంతోషాలతో నూతన అనుభూతులతో జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరార్ జిల్లా ఆశీర్వదించండి నీ ఆజ్ఞలను శిరసా వహిస్తూ బాధ్యతాయుతమైన జీవితం జీవిస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి చెందినట్లు చేయమని మా నాథుడు నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము ప్రభువా ఆమెన్

BACK TO TOP

పుట్టు వెంట్రుకలు

పావన  రూపుడైన దేవా స్త్రీ పురుషు లను నీ రూపు రేఖలలో కలుగు చేసావు అందచందాలను ఆయురారోగ్యాలను అందిస్తూ ఇస్తున్నావు నీ యెడల భక్తి భావముతో కృతజ్ఞతా పూర్వకంగా పుట్టు వెంట్రుకలు సమర్పించవలసిన బిడ్డలను నీవల్ల సంపదలు ఎదిగినట్లు దైవ ప్రేమ పొందునట్లు క్రమశిక్షణ కర్తవ్య నిర్వహణలో పరిశుద్ధాత్మ శక్తి తో ఆశీర్వదించి మా కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము ఆమెన్

BACK TO TOP 

 

చెవులు కుట్టించుట

మహిమాన్వితుడైన యేసు ప్రభువా చెవుల్లో నీళ్లు పెట్టి ఉమ్మి నీటితో నాలుకను తాకి మూగ చెవిటి వారికి స్వస్థత కూర్చాడు పంచేంద్రియాల లో ఒకటైన అనేది గొప్ప వరం అందుకే నీ భక్తుడు సేవకు డైన పౌలు మహర్షి వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును అని బోధించాడు సాంప్రదాయంగా చెవులు కుట్టించడం సదాచారము ఆధ్యాత్మికం కొంత అర్థాన్ని పరమార్ధాన్ని సంతరించుకుంది బిడ్డలు నీ అనుగ్రహం తో నింపి కేవలం శారీరక సౌందర్యమే కాకుండా దేవుని వాక్యం వినడంలో కూడా వహించినట్లు దీవించమని నీ పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్

BACK TO TOP

 

అక్షరాభ్యాసము

విజ్ఞాన దీప్తి అయిన దేవా సోలోమోను  ప్రార్థన ఆలకించి విజ్ఞానంతోనే  నింపావు ఫలితంగా నీ ప్రజలను సన్మార్గంలో నడిపించే వాడు ఆదర్శప్రాయంగా నిలిచిపోయాడు అక్షర జ్ఞానం మానవాళికి నీవు ఇచ్చిన ఉత్కంఠ వరం మూడో నేత్రం అక్షరాభ్యాసం శుభ సమయంలో ఒక్క బిడ్డను ఒక్క కుటుంబాన్ని మీ ఆశీస్సులతో నింపండి జ్ఞానంలో ప్రాయంలో చదువులు సంస్కారం ఓపెన్ చేయండి విజ్ఞాన వెలుగు లో ప్రయాణిస్తూ  చీకటికి చీకటి పనులకు దూరంగా ఉండ ప్రేరేపించడం డి భక్తి ప్రపత్తులు కలిగి నీకై తపిస్తూ తన జీవితాన్ని ఫలవంతం చేసుకునే భాగ్యం ప్రసాదించమని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము ఆమెన్

BACK TO TOP

 

రజస్వల మహోత్సవం

మా జీవనాధార మా నీవు మానవజాతికి ఇచ్చిన గొప్ప వరం ప్రకృతి దానిని అనుభవించి ఆనందించమని  దీవించి నావు నీవు బాల్యము నుండి వృద్ధాప్యము వరకు శారీరక మానసిక ఆధ్యాత్మికం మార్పులెన్నో జరుగుతుంటాయి స్త్రీలలో రజస్వల కావడం శ్రీ జీవిత పరిపూర్ణతకు తొలిమెట్టు రజస్వల పురస్కరించుకొని ఉన్నటువంటి బిడ్డ ఆశీస్సులు కలిపించండి ఆధ్యాత్మిక జీవితంలో కూడా పరిపక్వ వినయ విధేయతలు కలిగి జీవించినట్లు నీ అమృత హస్తములతో ఆశీర్వదించమని మా నాధుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము

BACK TO TOP

 

ఒణిల దోవతుల  ప్రధానము

మహోన్నతుడైన దేవా డబ్బులు సృష్టించి పోషించి పెంచి పెద్ద చేసే వాడవు నీవే అందచందాలు అలంకరణలు ఆభరణాలు అన్నియు నీ వరప్రసాద గీతములే బాహ్య సౌందర్యమే కాకుండా ఆత్మీయ సౌందర్యాన్ని కాంక్షించే దేవుడవు అందుకే దుస్తులు ధరించి ఆభరణాలు అలంకరణలో కానీ సంస్కారవంతంగా భక్తి పరంగా ప్రవర్తించి జీవించ దీవించండి నూతన దుస్తులు  ధరించు  ఈ నీ బిడ్డను పరిశుద్ధాత్మతో నింపి  నడిపించు మనియుగయుగములు జీవించి పరిపాలించు మా   నాథుడు నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము

BACK TO TOP 

 

నిశ్చితార్థం

ప్రేమ స్వరూపుడు అయిన దేవా వివహ నిశ్చితార్థం మున కై ఇక్కడ చేరిన బిడ్డను ఆశీర్వదించండి నీ పవిత్ర ఆత్మ జ్ఞానం వీరి హృదయాలలో భద్రపరచండి  వివాహ సంస్కారము నకై  తమ్ము తాము సిద్ధ పరుచుకుని పరిపూర్ణంగా  సమర్పించుకోన భక్తిని మీ శక్తిని  అనురక్తిని అనుగ్రహించండి  నీ కృప సంపదలో దిన దిన ప్రవర్ధమానం అవుతూ పరస్పర గౌరవ ప్రేమలలో    పెంపొందుతూ పవిత్ర వివాహ బంధములో  ప్రవేశించ  దీవించండి వీరి ఆదర్శ జీవితం అందరికీ  ఆదర్శంగా ఉండునట్లు  మా నాథుడు నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము

BACK TO TOP 

 

ప్రధానోత్సవం ప్రార్ధన

ప్రేమ స్వరూపుడు అయిన దేవా వివాహ మంత్రములు సంస్కారం గానూ శాశ్వత బంధం గాను పవిత్ర ప్రేమ బంధం ఆశీర్వదించారు అట్టి పవిత్ర బంధం లో తమ్ము తాము సంసిద్ధ పరుచుకుని సంస్కృతి పరమైన అనే సాంప్రదాయ  వేడుక ద్వారాశారీరకంగానూ మానసికంగానూ ఆధ్యాత్మికంగాను బిడ్డలం పరిశుద్ధాత్మతో నింపండి నిర్మలము నిష్కలంక మును  అగు శరీరక  ఆధ్యాత్మిక  సౌందర్యంలో తనను తాను అర్పించుకునే ఆత్మీయ శక్తి నీ పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొనుచున్నాను ఆమెన్

BACK TO TOP

 

నూతన దంపతులకు ఆశీస్సులు

అనురాగ నిలయమైన దేవా వివాహ సంస్కారాన్ని అన్నిటిలోనూ ఘనంగా ఉన్నతంగా కలుగజేశారు వివాహ దోస్తులు ప్రవేశించిన నూతన దంపతులను దీవించండి వీరి వైవాహిక జీవితం శాంతియుతంగానే సమాధానం గాను సాగినట్లు పరిశుద్ధాత్మ పూరితులై ఆదర్శ దంపతులు వర్ధిల్లునట్లును చెయ్యండి వారి కోరికలను తీర్చి తమకు కలుగబోవు సంతానమును భక్తిప్రపత్తులతో ఆదర్శ క్రైస్తవ బిడ్డలుగా తీర్చి దిద్దుట కావలసిన శక్తిని ప్రసాదించమని మా నాధుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము ఆమెన్

BACK TO TOP

 

సంతానభాగ్యము

ఉదయగల దేవా  మానవుని స్త్రీ పురుషుల  గాను  సృష్టించావు మమతానురాగాల తో నింపావు బిడ్డలను పెక్కు మంది అభివృద్ధి చెందని అన్నావు బంధాలు అనుబంధాలను కూడా సంకల్పాలు వివాహ మధుర అనుబంధంలో ప్రవేశించి ప్రార్థించే దంపతులను ఆశీర్వదించండి మీ దివ్య ఆశీస్సులు అందించండి ప్రార్థించగా అన్నా కోర్కెను  మన్నించి సాము వేలు ప్రవక్తను ప్రసాదించారు అబ్రహం   సారాల ఆతిథ్యం  స్వీకరించి సంతాన ప్రాప్తి రస్తు అన్నావు వృద్ధులైన జకరయ్య ఎలీసబెతు లను  కరుణించి సాక్షాతు  దైవ కుమారుడు యేసు మార్గాన్ని సుగమం చేయ    పునీత యోహానును  అనుగ్రహించావు నీ చల్లని నీడలో దీవెనలను వీరి ఆశలను ఫలవంతం చేయమని మా నాధుడైన యేసు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము ఆమెన్

BACK TO TOP

 

 సీమంతం వేడుక

మంగళ దాయక స్త్రీ పురుషులలో అనురాగాలు ఆప్యాయతలు అనుబంధాలు సృష్టించి పోషించే దేవుడు అసలు ఆశయాలు చిగురించి పుష్పించి ఫలింప చేయ ప్రభువుడవు భార్య భర్తలు ప్రేమానురాగాలకు వచ్చే పూలే పిల్లలు దాంపత్య జీవితాన్ని భవానికి ఫలితంగా గర్భము దాల్చిన నీ చూలలిని ముఖ్యంగా సీమంతం సందర్భంగా నీ ప్రేమ గల హస్తములకు చాచి ఆశీర్వదించండి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండునట్లు సంప్రదాయబద్ధమైన సీమంతం సంబరంలో నీ ఆశీర్వాదం అందించమని ఇక్కడ చేరిన అందరిని దీవించమని మానవుడైన ఏసు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము ఆమెన 

BACK TO TOP 

 

దుష్టుల  త్రోవలో నడవక  ఉండేందుకు ప్రార్ధన

దయగల దేవా, నన్ను మంచి మార్గములో నడిపించుము తండ్రి. దుష్టుల ఆలోచనచొప్పున నడువక,  పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఉండేటువంటి భాగ్యాన్ని నాకు దయచేయండి. దుష్టులు వలె  నుండక నేను మీ యొక్క వాక్యానుసారం జీవించేటట్లు చేయండి ప్రభూ.

దుష్టులు  గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు, నీతిమంతుల యొక్క  మార్గము మీకు తెలియును,  దుష్టుల మార్గము నాశనమునకు దారితియును అని మీరు  మీ వాక్యము ద్వారా సెలవిచ్చియున్నారు ప్రభువా. ప్రభువా నేను మీ యొక్క  ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, రాత్రింబగళ్ళు  మీ యొక్క వాక్యాని  ధ్యానించుభాగ్యాన్ని నాకు దయచేయండి. దయగల తండ్రి మీరు విధముగా సెలవిచ్చియున్నారు తండ్రి, మీ వాక్యము చదివిన ప్రతి బిడ్డ  తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును అన్ని సెలవిచ్చియున్నారు. నేను కూడా మీ యొక్క వాక్యాన్ని క్రమం తప్పకుండా పఠించి, వాటిని అనుసరించు వరాన్ని నాకు అనుగ్రహించండి. నా మనవిని మా నాధుడైన యేసు క్రిస్తు ద్వారా మీ ముందుంచుచున్నాను తండ్రి. ఆమెన్.

BACK TO TOP

 

శత్రువుల బారి నుంచి రక్షణ కొరకు ప్రార్ధన

నా దేవా నా ప్రాణము నిన్నే  నమ్ముకొని మౌనముగా ఉన్నది. నీ వలెనే  నాకు రక్షణ కలుగును ప్రభువా. నీవే  నా ఆశ్రయదుర్గము నీవే  నా రక్షణకర్త. నా  ఎత్తయిన కోట నీవే ప్రభూ.  మీరు నాకు తోడు ఉన్నంత వరకు నన్ను ఎవరూ  కదలింప లేరు. ప్రభువా ఎన్నాళ్లు నా శత్రువులు నాపై బడుదురు? ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను నా శత్రువులు పడ ద్రోయునట్లు వీరందరి కబ్బంద హస్తాలనుంచి నన్ను కాపాడండి ప్రభువా. మీ  ఔన్నత్యము వెలకట్టలేనిది. నేనంటే గిట్టని వారు నన్ను పడద్రోయుటకే  ఆలోచించుదురు, నా గురించి అబద్ధమాడుట వారికి సంతోషము కలిగించును.  వారి  నోటితో శుభవచనములు పలుకుచు అంత రంగములో నన్ను  దూషించుదురు.

మీ వల్లనే  నాకు నిరీక్షణ కలుగుచున్నది. మీరే  నా  బలమైన ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తయిన కోట.  మీరు మహిమగల నా రక్షణకర్త. ప్రభువా నేను యెల్లప్పుడు మీ యందు నమ్మిక యుంచునట్లు,  మీ  సన్నిధిని నా  హృదయములో పదిలపరచుకొనేటట్లు నాకు వరాలను ప్రసాదించండి.

ప్రభువా, మనుష్యులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కావున మా మీద  కృపచూపుటయు నీ దయ ప్రభు. తండ్రి అల్పులైన మాలాంటి వారికి మీరు   ఊపిరియై యున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి ఊరట, ఓదార్పనివ్వండి. బలహీన సమయములో మాకు మీరు బలమై మాలో ధైర్యాన్ని నింపండి. నా యొక్క పంచేంద్రియాలను అదుపులో పెట్టుకొనే మంచి ఆలోచనలను నాకు ప్రసాదించండి.  నా మనవిని మా నాధుడైన యేసు క్రిస్తు ద్వారా మీ ముందుంచుచున్నాను తండ్రి. ఆమెన్.

BACK TO TOP

 

వేకువ జామున ప్రార్ధన

మహిమ గల దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను స్మరించుకొనే మంచి గుణాన్ని నాకు ప్రసాదించండి. వేకువజామున నీ  బలమును, నాపై  నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీకు మొరపెట్టుకొనుచున్నాను. నీళ్లు లేక యెండియున్న ఎడారి వలె  నా హృదయము, నా ప్రాణము నీకొరకు వేచి యున్నది.  నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము, నా ఆత్మ తపన పడుతుంది.

ప్రభువా, నీ కృప జీవముకంటె ఉత్తమము,  నా పెదవులు నిన్ను ఎల్లవేళలా  స్తుతించే భాగ్యమును నాకు ప్రసాదించుము.
నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు, నా ఆత్మ సంపూర్ణ ఆనందము పొందుతూ  తృప్తిపొందుచున్నది.  నా హృదయము ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది.
దయగల దేవా, నేను నా జీవితకాలమంతయు నిన్ను స్తుతించె భాగ్యాన్ని నాకు ప్రసాదించండి. నేను సదాకాలము  నీ నామమును, నీ కార్యములను స్మరించుకొంటూ ఉండేటువంటి వరాన్ని నాకు ప్రసాదించండి.
నా ప్రభువా, నీవు నాకుఎల్లవేళలా  సహాయకుడవై యుంటివి,  నీ రెక్కల చాటున నన్ను సదాకాలము కాచి కాపాడుము ప్రభువా. నా దేవా, అనేకమార్లు నీ నామమును, నీ కార్యములను మరచి, నీ మార్గమునకు దూరముగా పోవుచుంటిని. సైతాను శోధనలు నన్ను మీ నుంచి దూరం చేయుచున్నాయి ప్రభువా. బలహీనమైన నా హృదయాన్ని బలపరచండి. ఎన్ని కష్టములు, బాధలు, ఆటంకాలు ఎదురైనా, మీ మార్గమును అనుసరించే ఓర్పు, సహనం, ధైర్యమును నాకు అనుగ్రహించండి.  నా మనవిని మా నాధుడైన యేసు క్రిస్తు ద్వారా మీ ముందుంచుచున్నాను తండ్రి. ఆమెన్.

BACK TO TOP

 

దేవుని కార్యముల యందు నమ్మకము కొరకు ప్రార్ధన

తండ్రి  మీ వాక్యము యథార్థమైనది,  మీరు మా కొరకు   చేయునదంతయు మేము మరువకుండునట్లు, మీ కార్యములను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని వాటికనుగుణంగా నడచుకొనుటకు కావలసిన వరాలను మాకు ప్రసాదించండి. మీరు నేర్పినటువంటి  నీతిని, న్యాయమును తుచ తప్పకుండ అనుసరించు శక్తి సామర్ధ్యాలను ప్రసాదించండి. ఈ  లోకము అంతా
మీ కృపతో నిండియున్నది అనే సత్యాన్ని ఎల్లవేళలా గుర్తుంచుకొనేటట్లు, నీ  వాక్కు చేత ఆకాశములు కలిగెను, మీ  నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను అనే సత్యమును మేము ఎల్లవేళలా స్మరించుకునే భాగ్యమును మాకు ప్రసాదించండి. . సముద్రజలములను,  అగాధ జలములను సృష్టించిన సృష్టికర్తయైన దేవా, మీ యందు భయభక్తులు కలిగి ఉండేటట్లు మా విశ్వాసాన్ని బలపరంచండి.

తండ్రి, మీ ఆలోచన సదాకాలము నిలుచును, మీ  సంకల్పములు తరతరములకు ఉండును. అదే విధముగా మా ఆలోచనలు, మా సంకల్పములు నిత్యము  మీ యందు ఉండునట్లు, మీరు మాకు చూపించిన మార్గములో పయనించే సామర్ధ్యాన్ని  మాకు అనుగ్రహించండి. మహిమగల దేవా, మీ  దృష్టి  మీ యందు భయభక్తులుగలవారి మీదను మీ  కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచు చున్నది అని మేము బలముగా నమ్ముతున్నాము. ఈ మా విశ్వాసాన్ని బలపరంచండి. నా మనవిని మా నాధుడైన యేసు క్రిస్తు ద్వారా మీ ముందుంచుచున్నాను తండ్రి. ఆమెన్.

No comments:

Post a Comment

All are gods Children - Anonymos