సంతాన భాగ్యము సమయంలోని ప్రార్ధన
దయగల దేవా మానవుని స్త్రీ పురుషులుగాను సృష్టించావు. మమతానురాగాలతో నింపావు. ఈ నీ బిడ్డలను పెక్కు మంది అభివృద్ధి చెందమని అన్నావు. ఈ బంధాలు అనుబంధాలను కలకాలం కలిగి ఉండేలాగున ఆశీర్వదించండి. ఈ మీ బిడ్డలు వివాహ మధుర అనుబంధంలో ప్రవేశించి ప్రార్థించే ఈ దంపతులను ఆశీర్వదించండి. మీ దివ్య ఆశీస్సులు అందించండి. ప్రార్థించగా అన్నా కోర్కెను మన్నించి సామువేలు ప్రవక్తను ప్రసాదించారు. అబ్రహం సారాల ఆతిథ్యం స్వీకరించి సంతాన ప్రాప్తిరస్తు అన్నావు. వృద్ధులైన జకరయ్య ఎలీసబెతులను కరుణించి సాక్షాతు దైవ కుమారుడు యేసు మార్గాన్ని సుగమం చేయ పునీత యోహానును అనుగ్రహించావు. నీ చల్లని నీడలో వీరు ఎల్లకాలము జీవించే లాగున మీ యొక్క దీవెనలను అందించి వీరి ఆశలను, ఆలోచలను ఫలవంతం చేయమని మా నాధుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమెన్