సీమంతం వేడుక సమయంలోని ప్రార్ధన
మంగళ దాయకయైన దేవా, స్త్రీ పురుషులలో అనురాగాలు ఆప్యాయతలు అనుబంధాలు సృష్టించి పోషించే దేవుడు. ఆశలు, ఆశయాలు చిగురించి పుష్పించి ఫలింప చేయ ప్రభువుడవు. భార్య భర్తల ప్రేమానురాగాలకు వచ్చే పూలే పిల్లలు. దాంపత్య జీవిత ఫలితంగా గర్భము దాల్చిన ఈ నీ చూలలిని ఆశీర్వదించండి. ముఖ్యంగా సీమంతం సందర్భంగా నీ ప్రేమ గల హస్తములను చాచి ఆశీర్వదించండి. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండునట్లు, ఈ సంప్రదాయబద్ధమైన సీమంతం సంబరంలో, నీ ఆశీర్వాదం అందించమని ఇక్కడ చేరిన అందరిని దీవించమని, మా నాధుడైన ఏసు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమెన్