రక్షణ కొరకు ప్రార్ధన
నా దేవా నా ప్రాణము నిన్నే
నమ్ముకొని మౌనముగా ఉన్నది. నీ వలెనే
నాకు రక్షణ కలుగును ప్రభువా. నీవే
నా ఆశ్రయదుర్గము నీవే
నా రక్షణకర్త. నా
ఎత్తయిన కోట నీవే ప్రభూ.
మీరు నాకు తోడు ఉన్నంత వరకు నన్ను ఎవరూ
కదలింప లేరు. ప్రభువా ఎన్నాళ్లు నా శత్రువులు నాపై బడుదురు? ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను నా శత్రువులు పడ ద్రోయునట్లు వీరందరి కబ్బంద హస్తాలనుంచి నన్ను కాపాడండి ప్రభువా. మీ
ఔన్నత్యము వెలకట్టలేనిది. నేనంటే గిట్టని వారు నన్ను పడద్రోయుటకే
ఆలోచించుదురు,
నా గురించి అబద్ధమాడుట వారికి సంతోషము కలిగించును.
వారి నోటితో శుభవచనములు పలుకుచు అంత రంగములో నన్ను
దూషించుదురు.
మీ వల్లనే
నాకు నిరీక్షణ కలుగుచున్నది. మీరే
నా బలమైన ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తయిన కోట.
మీరు మహిమగల నా రక్షణకర్త. ప్రభువా నేను యెల్లప్పుడు మీ యందు నమ్మిక యుంచునట్లు,
మీ సన్నిధిని నా
హృదయములో పదిలపరచుకొనేటట్లు నాకు వరాలను ప్రసాదించండి.
ప్రభువా,
మనుష్యులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కావున మా మీద
కృపచూపుటయు నీ దయ ప్రభు. తండ్రి అల్పులైన మాలాంటి వారికి మీరు ఊపిరియై యున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి ఊరట, ఓదార్పనివ్వండి. బలహీన సమయములో మాకు మీరు బలమై మాలో ధైర్యాన్ని నింపండి. నా యొక్క పంచేంద్రియాలను అదుపులో పెట్టుకొనే మంచి ఆలోచనలను నాకు ప్రసాదించండి. నా ఈ మనవిని మా నాధుడైన యేసు క్రిస్తు ద్వారా మీ ముందుంచుచున్నాను తండ్రి. ఆమెన్.
No comments:
Post a Comment
All are gods Children - Anonymos