వేకువజాము ప్రార్ధన
మహిమ గల దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను స్మరించుకొనే మంచి గుణాన్ని నాకు ప్రసాదించండి. వేకువజామున నీ
బలమును,
నాపై
నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీకు మొరపెట్టుకొనుచున్నాను. నీళ్లు లేక యెండియున్న ఎడారి వలె
నా హృదయము, నా ప్రాణము నీకొరకు వేచి యున్నది.
నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము, నా ఆత్మ తపన పడుతుంది.
ప్రభువా, నీ కృప జీవముకంటె ఉత్తమము, నా పెదవులు నిన్ను ఎల్లవేళలా స్తుతించే భాగ్యమును నాకు ప్రసాదించుము. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు, నా ఆత్మ సంపూర్ణ ఆనందము పొందుతూ తృప్తిపొందుచున్నది. నా హృదయము ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది.
దయగల దేవా, నేను నా జీవితకాలమంతయు నిన్ను స్తుతించె భాగ్యాన్ని నాకు ప్రసాదించండి. నేను సదాకాలము
నీ నామమును, నీ కార్యములను స్మరించుకొంటూ ఉండేటువంటి వరాన్ని నాకు ప్రసాదించండి.
నా ప్రభువా, నీవు నాకుఎల్లవేళలా సహాయకుడవై యుంటివి,
నీ రెక్కల చాటున నన్ను సదాకాలము కాచి కాపాడుము ప్రభువా. నా దేవా, అనేకమార్లు నీ నామమును, నీ కార్యములను మరచి, నీ మార్గమునకు దూరముగా పోవుచుంటిని. సైతాను శోధనలు నన్ను మీ నుంచి దూరం చేయుచున్నాయి ప్రభువా. బలహీనమైన నా హృదయాన్ని బలపరచండి. ఎన్ని కష్టములు, బాధలు, ఆటంకాలు ఎదురైనా, మీ మార్గమును అనుసరించే ఓర్పు, సహనం, ధైర్యమును నాకు అనుగ్రహించండి. నా ఈ మనవిని మా నాధుడైన యేసు క్రిస్తు ద్వారా మీ ముందుంచుచున్నాను తండ్రి. ఆమెన్.
No comments:
Post a Comment
All are gods Children - Anonymos