మంచి మార్గములో నడచుట కొరకు ప్రార్ధన
నీతిమంతుడైన దేవా, నేను నిన్ను హృదయపూర్వకంగా విశ్వసించాలని తాపత్రయపడుతున్నాను మరియు నేను నా స్వంత అవగాహనపై మొగ్గు చూపకుండా ఉండేందుకు ప్రయత్నం చేయుచున్నాను ఎందుకంటే నేను నా స్వంత అవగాహనపై ఎంచుకున్న మార్గం నన్ను విధ్వంస మార్గంలోకి నడిపిస్తుంది. నా హృదయం మలినమైనటువంటి ఆలోచనలతో నిండియున్నది. నేను ఎంచుకొన్న నా మార్గాలు నన్ను నీ యొక్క నీతి మార్గాల బాటల నుంచి నన్ను వేరుచేయుచున్నాయి తండ్రి.
కాబట్టి నేను నా జీవితాన్ని నీ చేతుల్లో ఉంచుతాను తండ్రి. నన్ను మీకు అనుకూలమైన రీతిగా మలచుకోండి తండ్రి. తండ్రి మీ యొక్క కార్యాలను నేను ఎప్పుడు సందేహించకుండా ఉండేటటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి. నన్ను అనుక్షణం సైతాను శోధనలనుండి నన్ను కాపాడండి. ఆమెన్.