దురాశ అనేది పదాన్ని ఈ విధముగా చెప్పవచ్చు, దురాశ అనేది అవసరమయ్యే దానికంటే ఎక్కువ సంపాదించడానికి లేదా సంపాదించడానికి కావలసిన అనేక మార్గాలను వెతుకుటకు, స్వలాభము అనే అపేక్షతో,అధికమైనటువంటి మరింత కోరిక, స్వలాభం కోరకు ఏదైనా సాదించాలి, ఏదైనా చెయ్యాలి లేదా మనిషి యొక్క అహంతో, మరింత కోరికగా తన స్వంత అభివృద్ది కొరకు ఒకరికి హాని చేయడానికైనా వేనుకాడని పరిస్తితిని కల్పించేదిగా దురాశ నిర్వచించబడింది, ముఖ్యంగా భౌతిక సంపద, అధికారం లేదా కీర్తి పరంగా మానవులకు ఉన్న దురాశకు అంతం అనేది లేదు.
దురాశ
ప్రతి వ్యక్తిలో వివిధ
రూపాల్లో
కనిపిస్తుంది. ఉదాహరణకు,
ఒక
వ్యక్తి అతను / ఆమె తీసుకోగల దానికంటే
ఎక్కువ
సంపదను సాధించాలని కోరుకుంటాడు లేదా కోరుకొంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి
ఒక్కరు
దురాశను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోతున్నారు. దురాశ వల్ల వచ్చే ఆనందం
ఎక్కువ కాలం నిలువదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు
దురాశతో, చెడు మార్గం ద్వారా సంతృప్తి మరియు శాశ్వత ఆనందాన్ని పొందాలని లక్ష్యంగా పెట్టుకొంటారు కాని ప్రతి ఒక్కరికి తెలియని విషయం ఏమిటంటే దురాశ వల్ల ప్రతి ఒక్కరు తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే పొందుతారు. మనకు ఎంత డబ్బు,హోదా, పరపతి, పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఈ హోదా, పేరు ప్రఖ్యాతులు, డబ్బు మనము దురాశకు పోయి అడ్డదారులలో సంపాదించినట్లైతే, మన జీవిత కాలము తీరని అసంతృప్తితో, ఎవరైతే మనద్వారా మోసగింపబడ్డారో, వారికి మన మొహం చూపించలేని స్టితిలో మనం ఉండి మరియు ఎల్లప్పుడు భయముతో బ్రతకాల్సిన పరిస్టితి మనకి దురాశ వలన కలుగును. మొదట్లో మనము డబ్బు అడ్డదారిలో సంపాదించినప్పుడు మన మనస్సు చాల సంతోషముతో ఉంటుంది కాని కాల క్రమేనా మనలో తీరని అసంతృప్తి, బాధ కలుగును ఎందుకంటె మనము దురాశతో ఒకరి జీవితానికి, లేదా ఒకరి పేరుకు అపవాదు తెచ్చి సంపాదించిన డబ్బు, హోదా మనకు నిరాశను జీవితాంతము మనకు కలిగించును.
దురాశ
ఒక వ్యక్తిని అసహనానికి, స్వార్థానికి మరియు
అహంకారానికి గురి చేస్తుంది, ఇది
చివరికి మనిషిలో భయం, అసూయ మరియు స్వార్థానికి
దారితీస్తుంది. ఉదాహరణకు, మీరు కష్టపడి మీ
లక్ష్యాలను సాధించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. మీరు స్వార్థపూరితంగా
మారినప్పుడు మీరు సాధించినదంతా మీదే అని మాత్రమే అర్ధం చేసుకొంటారు మరియు ఇతరులపై మన
యొక్క ఆలోచనా సరళి మారుతుంది. ఇతరులు అర్హులు
కానే కాదు, నేను మాత్రమె అర్హుడను
అనే బావన మనలో ఉన్నటువంటి దురాశకు నిదర్శనం. దురాశ
అనేటువంటి వ్యసనము నిరాశ మరియు సంఘర్షణలకు
దారితీస్తుంది. అయితే మీరు ప్రారంభంలో కీర్తి, ధనవంతులు, ఆనందం
మరియు అధికారాన్ని ఆస్వాదించవచ్చు కాని దీర్ఘకాలంగా మీలో పెరుగుతున్న దురాశ మీ
యొక్క సంపదను పోగొట్టుకోకుండా
నిరంతరము మిమ్మల్ని నిరాశ, ఆత్రుత, అసంతృప్తి
మరియు క్రోధంగా ఉండేవారిగా మారుస్తుంది. చాలా సార్లు దురాశ మీలోని చెడ్డ వ్యక్తిని
మిమ్మల్ని వినాశకరమైనదిగా చేస్తుంది. మీ
యొక్క ఆలోచనలు, నిరంతరము చెడు ఆలోచనలుగా
మరియు మిమ్ములను చెడు స్వబావలకు లోనయ్యేటట్లు దురాశ మీ మంచి స్వబావాన్ని చెడు
స్వబావముగా మారుస్తుంది. మనము ఒక మంచి ఆలోచనతో ఆలోచించినట్లైతే, విధ్వంసకమైనటువంటి
ఆలోచనలు కలిగిన, మరియు ఇతరులకు అపాయము చేసే
స్వబావము కలిగిన వ్యక్తితో ఉండటానికి ఎవరూ
ఇష్టపడరు.
అందువల్ల
అత్యాశగల వ్యక్తి ఒంటరిగా ఉంటాడు మరియు తన చుట్టూ ఉన్న వ్యక్తులతో సంబంధాలు
కోల్పోతాడు. అత్యాశగల వ్యక్తి, ఇతరులతో
తనకు ఉన్న మంచి సంబంధాలను అర్థం
చేసుకోవడంలో విఫలమైతే, స్వార్ధానికి, సంపదకు
ఎక్కువ విలువనిస్తే, అతనికి సంఘములో పలుకుబడి, గౌరవము, హోదా
ఉండవచ్చు కాని ఆత్మీయ సంతృప్తి, ఆత్మీయ
సంతోషము కోల్పోతాడు. మనము మానవ సంబంధాలపై, అప్యాయతలపై
ఎక్కువ అవగాహన కలిగి ఉండి వాటికనుగుణంగా నడచుకోనుటకు కృషిచేయాలి. దురాశ కంటే
మానవ సంబంధాలు చాలా విలువైనవిగా ఉండాలి. నిజమైన ఆనందాన్ని, ఆత్మీయ
సంతోషాన్ని ఏ ధరకైనా మనము కొనలేము, నిజమైన
ఆత్మీయ ఆనందము వెలకట్టలేనిదీ, కాని
మనము మనలో ఒక కలుపు మొక్కగా పెరుగుతున్న దురాశ అనే వ్యసనాన్ని అంతమొందించి మన
యొక్క మంచి ఆలోచనలను, మనలోని మంచి ప్రవర్తనను
అభివృద్ది చేసుకొని ఒక మంచి పేరును మనకంటూ మనము ఉండే సంఘములో సంపాదించాలి.
దురాశ
యొక్క పరిణామాలు మనము ఆలోచించే విధానానికి భిన్నంగా ఉంటాయి. మనలోని ఉన్నటువంటి
దురాశ అంతా మనలోని ఉన్నటువంటి ఆలోచనలతో సమానం కాదు. ఎక్కువ సంపాదించాలనే మన యొక్క
కోరిక లేదా దురాశ మనలను వక్ర
మార్గములో ప్రయానించేటట్లు చేస్తుంది. మరియు మన ఉద్యోగాన్ని
సైతం కోల్పోయేటట్లు చేస్తుంది ఎందుకంటె మనము చేసే ఉద్యోగం వల్ల మనకు వచ్చే ఆదాయము
చాలా తక్కువ, తక్కువ సమయములో ఎక్కువ
డబ్బు సంపాదించాలన్న చెడు కోరిక, దురాశ
మనలోని ఉన్నటువంటి చెడు మనస్తత్వాన్ని పురికొల్పి చెడు పనులు చేసే లాగున ప్రేరేపిస్తుంది. ఎక్కువ
సంపాదించడానికి మనము నీతిగా కష్టపడి
పనిచేయడము ఒక గొప్ప మార్గము.
అయితే మన ఆలోచనలు సరైన
దిశలో నడిస్తే దురాశ అనే వ్యసనము కూడా మంచి చేసే పనులను, అనేక
అద్భుతాలను సృష్టిస్తుంది. ఉదాహరణకు, దురాశ
అనే ఈ తపన శాస్త్రవేత్తలు సమాజ
శ్రేయస్సు కోసం దోహదపడటానికి పరిశోధన చేయడానికి
దురాశను శాస్త్రవేత్తల చోదక శక్తిగా నిరూపించవచ్చు, మరియు వ్యాపార
వ్యక్తులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి అనేక మార్గాలలో దురాశ అనే మార్గం, ఇది
వ్యాపారుల స్వలాభివృద్ధి కొరకు ఉపయోగించిన దురాశ
ఒక క్రొత్త పారిశ్రామికీకరణకు మరియు అనేక
మందికి పనిని కల్పించుటలో దురాశ కీలకమైన పాత్రను ఫోషిస్తుంది, మనుషులలో
ఉన్న తపన, ఏదో కనుగోనాలనే ఆత్రుత, తమ
స్వప్రయోజనాల కొరకు దురాశతో కూడా
ఒక క్రొత్త నాగరికతకు జీవం పోస్తున్నారు. దురాశ
లేకుండా మన పూర్వీకులు ఈ రోజు మన జీవితాలను చాలా సులభతరం చేసిన క్రూయిజ్లు, కార్లు
మరియు విమానాలను కనిపెట్టలేదు.
దురాశ ప్రతి ఒక్కరికీ
ప్రయోజనం చేకూరుస్తుంది. దురాశ ప్రతి దేశం యొక్క అభివృద్ధికి మరియు ప్రతి ఒక్కరి
జీవితములో ఏదో తమ కొరకు సాదించాలనే తపనకు పునాది.
మన విప్లవకారుల దురాశ వల్ల అనగా మనదేశానికి మనము స్వాతంత్ర్యం
తెచ్చుకోవాలి, బ్రిటిషు పాలన నుంచి
విముక్తి పొందాలి అనే దురాశ, ఒక
ఆత్రుత, ఒక తపన వల్ల దురాశ అనే
అస్త్రం ద్వారా మన దేశానికి స్వాతంత్ర్యం
లభించేలా చేసింది. కొన్నిసార్లు దురాశ ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. మదర్ తెరెసా
కూడా అత్యాశగల మహిళ. పేదలకు సేవ చేయాలనే ఆమె దురాశ, తపన
వల్ల ఈ రోజు మహా నగరమైన కొలకొత్త్హాలో నిరుపేదలు, అనాదులు, అబాగ్యులు నాణ్యమైన
జీవితాన్ని గడపడానికి సహాయపడింది. మిషనరీలు తమ మత విశ్వాసాలను వ్యాప్తి చేయడానికి
మరియు మనం నివసించే ఈ భూ గ్రహంను పాప
రహితంగా చేయడానికి అత్యాశతో, ఆత్రుతతో ఉన్నారు.
మనలో చాలా మంది ఈ
ప్రపంచంలో అతిపెద్ద సమస్యలలో ముఖ్యముగా మనకు తెలిసినవి పేదరికం, సాయుధ పోరాటాలు మరియు గ్లోబల్ వార్మింగ్ అని
నమ్ముతారు. సరే, అది కాదు, వాస్తవానికి ఈ రోజు మనం ఎదుర్కొంటున్న అతి
పెద్ద సమస్య మానవ దురాశ. దురాశ అనేది ఒక తీవ్రమైన మరియు స్వార్థపూరిత కోరిక. దురాశ
యొక్క అత్యంత సాధారణ రకం లేదా దురాశ అనగా మనకు వెంటనే గుర్తుకు వచ్చేది డబ్బు.
మనలో చాలా మందికు దురాశ అనేది చాలా సాధారణమైనటువంటి వ్యసనం.
మనము నివసించే ప్రాంతంలో, మన సంఘములో లేదా మన
గ్రామంలో చాలా మంది ధనికులు దురాశకు లోనై చాలా డబ్బును, బంగారమును, అనేకమైనటువంటి విలువైన
వస్తువులను వారి వారి ఇంట్లో కలిగి ఉంటారు. దొంగలు వారు లేని సమయములో వారి యొక్క
డబ్బును,
బంగారమును, విలువైన వస్తువులను
దొంగిలిస్తారు. చాలా మంది వారి యొక్క దురాశ వలన వారి యొక్క డబ్బున్ను దొంగలు దొంగిలించడానికి
ముఖ్య కారణం. మన యొక్క సంఘములో ఉన్నటువంటి ధనికుల కుటుంబాలపై దాడి చేసి వారి
ధనమును,
వస్తువులను
దొంగిలించి వారిని ఒక సాధారణ వ్యక్తులుగా వీధుల్లో పెట్టడానికి వారి యొక్క దురాశ
అనేక కారణాలలో ఒక ముఖ్య కారణం.
దురాశ వలన ధనికుల యొక్క
లేదా సామాన్యుల యొక్క కుటుంబాలు మాత్రమే కాదు, దేశాల మధ్య కూడా యుద్ధాలు జరుగుతున్నాయి, దేశాల మధ్య సత్సంబంధాలు
దెబ్బతింటున్నాయి. ఒక దేశం మరొక దేశము యొక్క విలువైన వనరులపై యుద్ధాలు జరగడానికి
దురాశ కూడా ఒక ముఖ్య కారణం. మనుషుల మధ్య చూసినట్లైతే,
అమాయకులను హత్య చేయడానికి
దురాశ కూడా ఒక ముఖ్య కారణం. ఒకరి యొక్క ఎదుగుదలను మరొకరు తట్టుకోలేక ఎదుగుతున్న
వ్యక్తులను తమ యొక్క స్వలాభాల గురించి ఈ లోకము నుంచి వారిని శాశ్వతముగా దూరము
చేయడానికి ఒకే ఒక మార్గం ఎదుగుతున్న వ్యక్తులను హత్య చేయడం. ఈ విధముగా మనవులలోని
దురాశ హత్యను ప్రేరేపిస్తుంది. మన విద్యను పూర్తి చేయడానికి ముందే మనం
అప్పుల్లో మునిగిపోవడానికి దురాశ మరి ఒక కారణం. మన తల్లి దండ్రులు మనకు మంచి
విద్యను అందచేయాలనుకోవడములో ఒక మంచి ఉద్దేశాన్ని మనము గమనించవచ్చు,
కాని మన తల్లి దండ్రులు మన
పక్కింటి పిల్లలతో మనలను పోల్చి, లేదా మన తల్లి దండ్రులు చదివిన గొప్ప చదువులు
మనమూ చదవాలని అనుకోవటం కూడా సమంజసమే, కాని తల్లి దండ్రులు తమ పిల్లల యొక్క
సామర్ధ్యాన్ని గమనించకుండా సంఘములో తమ పిల్లల చదువుల
గురించి గోప్పగా చెప్పుకోవాలన్న దురాశ అనేటువంటి గోడ తమ పిల్లల మనస్త్యత్య్వాన్ని, పిల్లల యొక్క ఆలోచనలను
పట్టించుకోకుండా చేస్తుంది. తల్లి దండ్రుల యొక్క దురాశ వలన పిల్లలు వారు చదివే
చదువులలో రాణించలేక మానసికముగా సతమతమై జీవితములో వెనుకబడుతుంటారు. ఈ యొక్క సాంకేతికత, శాస్త్రీయ యుగములో మనము
జాగ్రతగా చూసినట్లయితే,
ప్రపంచంలోని
చాలా పెద్ద సమస్యల వెనుక, కుప్పకూలిపోతున్న ఆర్థిక
వ్యవస్థలు, పేదరికం మరియు యుద్ధాలు
వంటి దురాశ ప్రధాన కారణం.
దురాశ 'అంటే ఏదో ఒక బలమైన మరియు స్వార్థపూరితమైనటువంటి కోరిక.
అత్యాశ ఉన్నవారు వారి జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు
ఎందుకంటే దురాశ ఎప్పుడూ వారిని సంతృప్తి ఆనందానికి దూరం చేస్తుంది.
మనిషిలో ఉన్నటువంటి దురాశ అనే వ్యసనానికి పరిమితి, లేదా
అంతము అనేది లేదు, మనిషి ఎప్పుడూ తన స్వంత లాభానికి మాత్రమే
పని చేస్తాడు, అలొచిస్తూ ఉంటాడు. సంపద మరియు అధికారం
కోసం మనిషి ఏమైనా చేయడానికి వెనుకాడడు.
దురాశ మనలో చాలా అశాంతిని, ఇతరులపై ద్వేషాన్ని,
కొన్ని సార్లు మనపై మనకు అసహ్యం, కోపం పుట్టుకొచ్చేలా
మనలను మారుస్తుంది దురాశ ప్రజలను అసాధ్యమైన
పనులను కూడా చేయగలిగేటువంటి వారిగా కూడా చేస్తుంది.
సంపద మరియు అధికారం కోసం మనలో ఉన్నటువంటి దురాశ
మనలను కష్టాలపాలు చేస్తుంది, మనలో సంపూర్ణ ఆనందాన్ని
కోల్పోయేటట్లు చేస్తుందనడం చాలా నిజం.
దురాశ మన జీవితాలను నాశనం చేస్తుంది.
ఒకరు శక్తివంతులు కావడానికి లేదా ధనవంతులు కావడానికి
చెడు మార్గాల ద్వారా ప్రజలను హత్య చేయటానికి కూడా
మనలను ప్రేరేపిస్తుంది. దురాశ ప్రజలను గుడ్డిగా చేస్తుంది,
చెడు మార్గాల వైపు వెళ్ళేలా మన హృదయాలను మారుస్తుంది.
దురాశ వల్ల వచ్చే లాబాలు:
ఈ ప్రపంచంలో, ప్రజలు అనేక విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.
మనము మన జీవితాలలొ ఉన్న ప్రేమానురాగాలు,
మమతానురాగాలు, ఆప్యాయతలు మీద ఎక్కువ ఇష్టపడతాము.
ఈ ప్రపంచం ఇప్పుడు పూర్తిగా డబ్బు, పేరు ప్రఖ్యాతుల మీద నడుస్తుంది.
డబ్బు మరియు శక్తి లేకుండా, ఒక వ్యక్తి వాస్తవానికి భూమిపై జీవించలేడు.
శక్తి మరియు గొప్ప సంపద కలిగిన శక్తివంతమైన వ్యక్తులచే
అవి కొద్ది నిమిషాల్లోనే పూర్తి చేయబడతాయి.
ఈ భూమిపై మనుగడ సాగించడం కోసం ప్రధానంగా స్వార్థపరులు
సంపద మరియు అధికారం కోసం ఎన్నోసార్లు దురాశ అనే వ్యసనాన్ని
తమకు అనుకూలముగా మలచుకొంటారు.
దురాశకు వ్యతిరేకంగా ఈ అంశాలు మనకు కనువిప్పు కలిగిస్తాయి:
నేను ముందు చెప్పినట్లుగా, దురాశ ఉన్న ప్రతి ఒక్కరూ ఎప్పుడూ
సంతృప్తి చెందరు . దురాశ అనే వ్యసనము గల యే వ్యక్తి
ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. దురాశ కలిగిన వ్యక్తులు
వారికి సంపద లేదా పేరు ప్రఖ్యాతులు అతి తక్కువ సమయములో,
ఎక్కువగా కష్టపడకుండా మరింత ఎక్కువగా కలగాలని కోరుకుంటారు.
దురాశ కలిగిన వ్యక్తులు నిజాయితీ ద్వారా ఎక్కువ శక్తిని, ఖ్యాతిని
మరియు సంపదను పొందలేనప్పుడు, ఎక్కువ శక్తి, ఖ్యాతి మరియు
సంపదను పొందడానికి తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటారు.
కొన్నిసార్లు, ఈ దురాశ కారణంగా ఎంతోమంది వృత్తి నాశనం అవుతుంది.
దురాశ చాలా ప్రమాదకరమైన వ్యసనము.
ఇది వాస్తవంగా ఎంతోమందిని జీవితములో ఎదగకుండా చంపుతుంది.
ముగింపు:
భూమిపై ఉన్న ప్రజల పరిస్థితి ఏమిటంటే,
మనం ఎల్లప్పుడూ పరిమితిలో అనగా మన ఆశలకు అదుపును పెట్టుకొని,
ఉన్నదానితో సంతృప్తి చెందాలి. మనకు అవసరమైన దానికంటే
ఎక్కువ ఆశలు ఉండకూడదు అనగా మన తాహతుకు మించిన కోర్కెలు
మనము కొరకూడదు, ఎక్కువ కోర్కెలు మనకు ఉన్న యెడల
మనము వాటిని మన అదుపులో పెట్టుకొని మనకు ఎంత అవసరమో
అంతటితో మనము సరిపెట్టుకోవాలి. మనకు కావలసిన
దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు, మనము అత్యాశకు గురవుతాము
మరియు మరింత ఎక్కువగా కావాలని కోరుకుంటున్నాము.
కాబట్టి నిజాయితీ ద్వారా సంపాదించిన పేరు ప్రఖ్యాతులతో, సంపదలతో,
వస్తువులతో మనం సంతోషంగా ఉండాలి.
మనకు ఉన్నవాటితో సంత్రుప్తి చెందడం మనము అలవర్చుకోవాలి.
దేవుడు మనకు ఇచ్చినవి ఇవి అని సర్దుకోవాలి. దేవుడు
మనకు కావలసినవి మనకు సమకూర్చాడు
కనుక దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొని,
మనకున్నవి ఇతరులకు లేనప్పుడు లేని వారి గురించి కూడా
మనము ప్రార్ధించాలి. .