మన యొక్క నడవడిక మార్చుకొనే నీతి మార్గాన్ని ఎంచుకోవడం
ఇటీవల ఒక జంట నా దగ్గరకు వచ్చింది. సుమారు ఐదేళ్ల క్రితం. వారు ప్రపంచంలో అత్యంత అద్భుతమైన ప్రేమ వ్యవహారాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు హాస్యాస్పదంగా, వారి ప్రశ్న. "ఒకరినొకరు చంపకుండా మేము ఎలా వేరు అవ్వగలం?" మానవ సంబంధాలను బానిస బందాలుగా మార్చే కళలో మానవులు నిపుణులుగా ఎదిగారు.
జీవితంతో ప్రమేయం ఉన్న చురుకైన స్థితిలో, మనము ఇతర ప్రజలతో చాలా సన్నిహిత బంధాలను పెంచుకుంటాము. మనము ఎన్నో స్థలాలు, జంతువులు మరియు వస్తువులు అన్నింటిని కలిగియుంటాం. ప్రారంభంలో ఇవి మన జీవితాలకు అద్భుతమైన మెరుగుదలలు మరియు అధ్బుతమైనవిగా, ఆనందంగా అనిపిస్తాయి, కాని మనకు తెలియనిది ఏమిటంటే మన మనస్సులు, ఆలోచనలన్నీ, మేము మా పని, మా ఇల్లు, మా కుటుంబాలు, మా సంపద మరియు మా ఆలోచనలు మన భావోద్వేగాలకు కట్టుబడి ఉన్నాము! మానవ సంబంధాలను మనము వ్యాపార ఒప్పందాలుగా, రాజకీయ ఒప్పందాలుగా మార్చడంలో మనము ప్రవీణులుగా మారాము. మనకు తెలియనిది ఏమిటంటే, ఈ ఆలోచనలు, కుతంత్రాలు, మనము ఎదగడానికి, ఎదుటివాళ్ల్లను త్రొక్కి వేయటంలో, ఎదుటివారికి హాని చేయటములో మనము ఆరితేరి యున్నాము. మన యొక్క మంచి ఆలోచలను చెడు ఆలోచనలుగా మలచుకొని మనలను మనము అజ్ఞానము అనేటువంటి బోనులో బంధింపపడ్డాము.
మానవ మనుగడకు, మనవ శ్రేయస్సు కొరకు, దేవుడు మనకు ఎన్నో సహజ వనరులను మనకు ప్రసాదించెను. మన యొక్క సహజ వనరులను మనము ఈ యొక్క శాస్త్రీయ యుగంలో విషపూరిత వనరులుగా మార్చడం అనేది బాధాకర విషయం. ఇంకా, ఇది మనం చేసే పని మాత్రమే కాదు మనము మన తోటి ప్రజలకు, ప్రాణులకు హాని చేస్తున్నాము, ఇటువంటివి జరుగకుండా మనము మనయొక్క రాబోయే తరాలకు మనము ఈ శాస్త్రీయ యుగంలో ఏమి కోల్పోయామో వాళ్లకు వివరించి మళ్లీ మళ్లీ సాధనాబివృద్దికి,సహజ వనరుల అభివృద్ధికి కృషి చేసి ఆపై వాటిని అనుభవించే విధముగా మనము మన రాబోయే తరాలుకు ఒక గుణపాటముగా నిలవాలి.
మన యొక్క ప్రాధమిక సమస్య ఏమిటంటే, మన జీవితాలు మనలను ఒకే ప్రశ్నతో మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాయి: `నేను ఈ యొక్క జీవితము నుంచి ఏమి నేర్చుకొన్నాను? ' ఈ సరళమైన ప్రశ్న మనకోసం మనం సృష్టించిన గొప్ప యంత్రాలు, వస్తువులు అన్ని మనలకు శారీరక లేదా మానసిక, ఆధ్యాత్మికమైన ఆనందాన్ని ఇస్తున్నాయా? ఇది మన జీవితానికి కీలకమైనటువంటి ప్రశ్న. మనము ఈ లోకములో చేసే ప్రతి పని మనలను వర్తక వ్యాపారులుగా మార్చుతుంది. వర్తకులు ఏమి చేస్తున్నారో మనము గమనించినట్లైతే, వారు వర్తక వ్యాపారములో ప్రేమానురాగాలకు విలువను ఇవ్వరు, వారికి వారి యొక్క వ్యాపారము ముఖ్యము. ఇది వారు చేసే ప్రతిదాన్ని
వర్తకవాద స్ఫూర్తితో నింపుతుంది. ప్రతి ఆనందకరమైన సమయములో కూడా వారు ఆ యొక్క ఆనందాన్ని అనుబవించకుండ ఆ సమయములో కూడా ఎంత లాభం పొందగలరో లెక్కించడం వారికి అలవాటు.
మత ప్రయోజన పథకాలలో కూడా మనము మనకు ఎంత లాభము వస్తుందో ఆలోచించుకొని వాటికనుగుణంగా చెడు పనులకు పాల్పడుతూ ఉంటాము. ఆధ్యాత్మికంగా మనము మనలను ప్రశ్నించుకోన్నట్లితే ఈ యొక్క చెడు ఆలోచనల నుండి, స్వలాభ ప్రయోజనాల నుండి మనము ఆత్మీయ ఆనందాన్ని పొండుతున్నామా? ఇతరులకు రావలసిన ప్రయోజనాలను, ఇతరులకు జరగాల్సిన మంచిని మనము మన యొక్క వ్యక్తీ గత అభివృద్దికి, మన వ్యక్తీగత స్వలాభానికి ఉపయోగించి, మన వ్యక్తిత్వానికి బానిసలుగా బతుకుట, ఎంత వరకు సమంజసము. మనయొక్క చెడు పనులతో, చెడు ఆలోచనలోతో వచ్చే తాత్కాలిక ఆనందము ముఖ్యమా లేదా మంచి కార్యముల ద్వారా, మంచి ఆలోచనల ద్వారా వచ్చే శాశ్వత ఆనందం ముఖ్యమా?
* మనకు మన హృదయాలలో శాశ్వత ఆనందం కావాలంటే, మొదటిగా మన గురించి మనము అలోచిన్చుకోనటం, మన స్వలాభానికి ప్రాముఖ్యత ఇవ్వటం, వ్యక్తిగతంగా లాభదాయక రీతిలో, వ్యాపార పరంగా ఆలోచించడం ఆపవలెను. మనము వ్యక్తీగత ప్రయోజనాల కోసం చూస్తున్నట్లయితే. మన యొక్క అనందం తాత్కాలికంగానే ముగుస్తుంది.మన యొక్క అనందం అనేది ఎక్కువ కాలం నిలువదు. మనము చేసిన చెడు కార్యములు ఏల్లకాలము మనలను బాదిస్తూ ఉంటాయి. మనకు అధ్యామిక, శాశ్వత ఆనందం కావాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, జేవితములో విజయవంతం కావాలన్నా, లేదా స్వర్గానికి చేరుకోవాలన్నా మంచి కార్యములను చేయుటకు ప్రాముఖ్యత ఇవ్వండి.
మనము ఎక్కడికైనా వెళ్ళినా, మనకు భయము, బాధ పడే అవసరం లేదు ఎందుకంటె మనయొక్క మంచి కార్యాలు మనకు కవచములా ఉండును. అందరు మనలను ప్రేమతో, ఆప్యాయతతో పలుకరిస్తారు, మనలను కంటికి రెప్పలా చూసుకొంటారు. ప్రేమ, కరుణ, భక్తి, సహాయత భావనలలో జీవించడం మనకు శాశ్వత ఆనందాన్ని జీవితకాలం కలుగ చేస్తుంది.
ఈ యొక్క ప్రేమ, కరుణ, భక్తి, సహాయత భావనలు ప్రధానంగా జీవితంతో మనలో ఉన్నటువంటి స్వలాభా బుద్ధి, మనలో ఇతరులపై గల కుళ్ళు, మనలో ఉన్న అహంకారాన్ని, చెడు ఆలోచనలను తొలగించే వ్యూహాలు లేదా మార్గాలు. దేవుని యొక్క ప్రేమ, వాత్సల్యం మనకు మంచి స్వభావాన్ని మంచి మార్గాన్ని చూపించును. మనము మనలో ఉన్నటువంటి చెడుకు సంబంధించిన అంశాలను తొలగించిన లేదా వదిలివేసిన తర్వాత, 90% పని మన
జీవితములో ముగిసింది. మిగతా 10% మన మర్గాన్ని ఒక మంచి మార్గముగా తీర్చిదిద్దేందుకు ఎటువంటి కశాత్రమైన పని లేకుండా సులువుగా జరుగుతుంది.
ముఖ్యముగా మనము ఈ యొక్క ప్రశ్నను వదులుకుంటే. 'నా గురించి ఏమిటి, నా కేమిటి లాభము', మనకు చింతించాల్సిన పనిలేదు. ఈ యొక్క క్రొత్త సంవత్సరం అనేది మనకు అలోచించుకొనే సమయం ఇచ్చినది. మనము గమనించినట్లైతే కరోన వైరస్ గత నెలల్లో మనం అమరత్వం లేని జీవితాన్ని జీవించ వచ్చని అహంకారముతో ఉన్నటువంటి మానవాళ్ళికి ఒక బాధాకరమైన సూచనగా వచ్చింది. మనము ఈ ప్రపంచములో దేనికైనా అర్హులమనే ఆలోచన నుండి, మరియు ఎటువంటి వ్యాధి అయినా గాని మానవ శక్తులు జయించగలరన్న నమ్మకాన్ని, అహంకారాన్ని ఆలోచించుకొనే విధముగా ఒక సవాలును మానవాళిపై విసిరింది. మనము లోతుగా ఆలోచించుకొనుటకు ఇది మనకు మంచి సమయము.
మనం బావించే ఆలోచనైనటువంటి అర్హత, మనము దేనినైన జయించగలము అనే అహంకారము నుండి కృతజ్ఞత వైపు వెళ్ళే సమయం ఆసన్నమైంది. దేవుడు అన్ని మనకు కల్పించాడు కనుక ఆయనకు ఎల్లవేళలా కృతజ్ఞత చూపాలి అనే అవగాహనకు చేరడం మనకు మన ముందున్న తక్షణ కర్తవ్యం. మనము మన మంచి ఆలోచనలను, చెడు కార్యముల కొరకు లావాదేవీలుగా మార్చినప్పుడు, మనకు కేవలం తాత్కాలిక ఆనందం మాత్రమే కొంచెం సమయం వరకు ఉండి, తర్వాత బాధా, భయము, గుండె మరియు మనస్సులో ఉద్రిక్తతలు మిగిలి ఉంటాయి.
కానీ మనం జీవితంతోనే గొప్ప గుణాలు, నేర్చుకున్నప్పుడు, మన ప్రతి జీవిత శ్వాస మనలను దేవునికి దగ్గరగా ఆలింగనం చేసుకుంటుంది. మనము పూర్తిగా నీతివంతమైన మార్గములో ప్రయానిస్తూనప్పుడు ఎటువంటి బాధాకరమైన, క్లిష్టమైన ఆటంకాలను దాటుకొని, ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా, అడ్డంకులు లేకుండా అనంతమైన కరుణతో, ప్రేమతో జీవిస్తూ ఉంటాము. ఈ యొక్క భూగ్రహం మీద మన యొక్క నీతి వంతమైన జీవితం ద్వారా, ప్రతి ఒక్కరిలో క్రొత్త మార్పు, క్రొత్త ధోరణి వచ్చే విధముగా ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు మంచి నడవడికతో, దేవునికి నచ్చే రీతిలో జేవించే సమయం ఆసన్నమైంది. మన యొక్క మంచి నడవడిక ద్వారా అది జరిగేలా చేద్దాం.